logo

వడగళ్ల వాన, ఈదురు గాలుల వల్ల నష్టపోయిన ఆదివాసీలను వెంటనే ఆదుకోవాలి* ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు*నిమ్మల రాంబాబు*

తెలంగాణ స్టేట్:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా::: ది.5-5-2024

పాల్వంచ రూరల్

*వడగళ్ల వాన, ఈదురు గాలుల వల్ల నష్టపోయిన ఆదివాసీలను ఆదుకోవాలి*
*నిమ్మల రాంబాబు*
సాయంత్రం సుమారు ఐదు గంటలకు వచ్చిన వడగళ్ల వాన, ఈదురు గాలులకు పాల్వంచ మండలం. దంతెల బోర ఎస్సీ కాలనీ పంచాయతీ. సీతారాంపురం గ్రామంలో 18 మంది ఆదివాసి పేదల ఇండ్ల పై కప్పులు ధ్వంసమై ,ఇండ్లు పాడైపోయిన విషయంపై ఈరోజు ది 4 5 2024న *సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ అనుబంధ IFTU జిల్లా నాయకులు: నిమ్మల రాంబాబు* సీతారాంపురం గ్రామాన్ని సందర్శించి ఆదివాసి పేదలను కలిసి వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్న సందర్భంగా మాట్లాడుతూ.... ఆదివాసి పేదలు ఆరుగాలం కష్టపడి ఇంట్లో దాచుకున్న ఆహార ధాన్యాలు మరియు నిత్యవసర వస్తువులు తడిసి ,గాలికి చెల్లాచెదురుగా పాడైపోయాయని .,రాత్రిపూట పడుకోడానికి కూడా చోటు లేకుండా ఆదివాసి పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.
ఇంట్లో కట్టెల పొయ్యిలో వంట చేసుకునేందుకు వీలు లేకపోవడం వలన తెల్లవార్లు ఉపవాసంతో గడిపారని, గ్రామానికి కరెంటు రోడ్లు తదితర కనీస సౌకర్యాలు కూడా లేవని. గత 25 ఏళ్లుగా నివసిస్తున్న 46 కుటుంబాల ఆదివాసి పేదలకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఇంటి పన్ను రసీదులు ఉన్నప్పటికీ...కనీస సౌకర్యాలైన రోడ్లు, కరెంటు ,మరుగుదొడ్లు, పక్కా గృహాలు లాంటి సౌకర్యాలు ఏమాత్రం కల్పించకపోవడం చాలా దుర్మార్గమని అన్నారు.
ఇప్పటికైనా సీతారాంపురం గ్రామానికి వెంటనే రోడ్లు ,కరెంటు, సౌకర్యం కల్పించాలని. రేకుల షెడ్లు, పెంకుటిళ్లలో ఉంటున్న ఆదివాసి పేదలకు పక్కా గృహాలు మంజూరు చేసి, గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధితులను పాల్వంచ తహసిల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ మండల నాయకులు: నీలం భాస్కర్
గ్రామస్తులు:మడివి దేవా, ముచ్కి గంగ, రవ్వ అంజలి, సునీల్ ,భద్ర, ఇడమమ్మ, దేవి ,సుక్కమ్మ, భారతి, నరేష్, ఉమేష్ ,మంగయ్య, ఉంగ తదితరులు పాల్గొన్నారు.

39
2120 views